Skip to main content

కేంద్రం ప్రారంభించిన పోషన్‌ అభియాన్‌ పథకం ఉద్దేశం?

దేశంలో 2020, నవంబర్‌ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది.
Current Affairs బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని జూన్ 6న తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ తెలిపిన వివరాల ప్రకారం...
  • అత్యధికంగాఉత్తరప్రదేశ్‌లో3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
  • లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేరు.
  • మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్‌లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210 మంది బాధిత బాలలు ఉన్నారు.
  • తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

2018లో పోషన్‌ అభియాన్‌ ప్రారంభం...
ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్‌ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్‌ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించింది.
Published date : 07 Jun 2021 07:27PM

Photo Stories