కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
Sakshi Education
తెలుగు రాష్ట్రాలకు చెందిన రచయితలు బండి నారాయణస్వామి, పెన్నా మధుసూదన్ 2019 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 25న జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను 2019, డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణస్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమి నవలకు, తెలంగాణ జడ్చర్లకు చెందిన పెన్నా మధుసూదన్ సంస్కృతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కేంద్ర సాహిత్య పురస్కారాలు లభించాయి.
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి ‘ఒక హిజ్రా ఆత్మకథ’ రచనకు గాను అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
చదవండి : కొంగవాలు కత్తికి యువ పురస్కార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : బండి నారాయణస్వామి, పెన్నా మధుసూదన్
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 26 Feb 2020 05:51PM