కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవార్డులను ఏ పేరుతో ప్రకటించారు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి.
దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో పాలన తీరు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలకు సహాయపడే కార్యక్రమాల అమలు తదితర అంశాలను పరిశీలించి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఏటా అవార్డులు ఇస్తుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వస్థీకరణ పేరుతో అవార్డులను మార్చి 31న ప్రకటించింది.
పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు?
పంచాయత్ స్వస్థీకరణ అవార్డుల్లో సాధారణ కేటగిరి జిల్లా స్థాయిలో గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లు అవార్డులను దక్కించుకున్నాయి. మండల స్థాయిలో సదుం (చిత్తూరు జిల్లా), కాకినాడ రూరల్ (తూర్పు గోదావరి), పెనుకొండ (అనంతపురం), విజయవాడ రూరల్ (కృష్ణా) అవార్డులు సాధించాయి. పంచాయతీ స్థాయిలో రేణిమాకులపల్లె (చిత్తూరు జిల్లా), పెద్ద లాబేడు (విశాఖ), గుళ్లపల్లి (గుంటూరు), వర్కూర్ (కర్నూలు) సాధారణ కేటగిరి అవార్డులను దక్కించుకున్నాయి. గ్రామస్థాయిలో ఈ గవర్నెన్స్ కేటగిరీలో తడకండ్రిగ, తల్లపాలెం (నెల్లూరు జిల్లా), కొండేపల్లి (ప్రకాశం) అవార్డులను గెల్చుకున్నాయి. ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Published date : 01 Apr 2021 06:33PM