కేంద్ర హోంశాఖ సెక్రటరీగా వి.ఎస్.కె.కౌముది
Sakshi Education
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏపీ కేడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వి.ఎస్.కె.కౌముది కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. పదవీ విరమణ (నవంబర్ 30, 2022) వరకు కౌముది ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు యూపీ క్యాడర్‌కు చెందిన మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆగస్టు 17న ఆన్లైన్ వేదిక ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణకర్తవ్యమని ఈ సందర్భంగ వెంకయ్య పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : వి.ఎస్.కె.కౌముదిఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆగస్టు 17న ఆన్లైన్ వేదిక ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణకర్తవ్యమని ఈ సందర్భంగ వెంకయ్య పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 17
Published date : 18 Aug 2020 04:36PM