Skip to main content

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా భల్లా

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌కుమార్ భల్లా ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ గౌబా స్థానంలో భల్లా నియమితులయ్యారు. భల్లా నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన భల్లా గతంలో కేంద్ర విద్యుత్ కార్యదర్శిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : అజయ్‌కుమార్ భల్లా
Published date : 24 Aug 2019 05:39PM

Photo Stories