కేంద్ర హోంమంత్రితో కేటీఆర్ సమావేశం
Sakshi Education
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీలో అక్టోబర్ 31న జరిగిన ఈ భేటీలో హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా అమిత్ షాను కేటీఆర్ కోరారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కలిసారు. హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్‌పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్ కోరారు. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే సైడింగ్ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 01 Nov 2019 05:27PM