Skip to main content

కేంద్ర హోం మంత్రితో ఏపీ సీఎం జగన్ భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.
న్యూఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలను తరలించి కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి కొరత తీర్చే ప్రాజెక్టును చేపట్టాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా హెడ్ వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరలో ఇచ్చేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Oct 2019 06:03PM

Photo Stories