కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా ఎవరు ఉన్నారు?
Sakshi Education
పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను ఫిబ్రవరి 26న కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది.
ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని 126 స్థానాలకు 3 విడతల్లోను, 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 స్థానాలు ఉన్న కేరళ, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరిల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు.
Published date : 27 Feb 2021 05:57PM