కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కృష్ణమూర్తి కన్నుమూత
Sakshi Education
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి (86) తుదిశ్వాస విడిచారు.
కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 14న ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీరాలలో 1934లో జన్మించిన కృష్ణమూర్తి.. 1950వ దశకంలో ఢిల్లీకి వచ్చారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. ఇండియన్ లీగల్ సర్వీస్ అధికారిగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేశారు.
1999 సెప్టెంబర్ వరకు...
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఎంఎస్ గిల్‌తోపాటు జీవీజీ కూడా నియమితులయ్యారు. బిహార్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. 1993, అక్టోబరు 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన కృష్ణమూర్తి 1999 సెప్టెంబర్ 30 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి (86)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అనారోగ్య సమస్యలతో

Published date : 16 Apr 2021 04:21PM