Skip to main content

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌?

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌ ఏప్రిల్‌ 16న బాధ్యతలు స్వీకరించారు.
Current Affairs
1987 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అజయ్‌... తరుణ్‌ బజాజ్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. తరుణ్‌ బజాజ్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ రెవెన్యూ కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో అజయ్‌ ఆయన స్థానంలో నియమితులయ్యారు. అజయ్‌ గతంలో బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2004 మధ్య ఆర్థిక వ్యవహారాల శాఖ, వ్యయ శాఖల్లో డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : అజయ్‌ సేథ్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : తరుణ్‌ బజాజ్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ రెవెన్యూ కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో...
Published date : 19 Apr 2021 11:44AM

Photo Stories