కేబినెట్ కార్యదర్శి గౌబా పదవీ కాలం పొడిగింపు
Sakshi Education
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ కార్యదర్శిగా రిటైరైన గౌబాను కేంద్రం 2019లో రెండేళ్ల కాలానికి గాను కేబినెట్ కార్యదర్శిగా నియమించింది. 1982వ బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన గౌబా పంజాబ్లో జన్మించారు. జార్ఖండ్ చీఫ్ సెక్రటరీగా 15 నెలల పాటు పనిచేశారు. అనంతరం కేంద్రంలో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు.
జోయలుక్కాస్కు రిటైల్మీ ఐకాన్స్ అవార్డు
ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ జోయలుక్కాస్ ప్రతిష్టాత్మకమైన రిటైల్‌మీ ఐకాన్స్ అవార్డు గెలుచుకుంది. మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కంపెనీ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. దుబాయ్ టూరిజమ్, కామర్స్ మార్కెటింగ్ సీఈఓ లైలా మొహమ్మద్ సుహైల్ చేతుల మీదుగా కంపెనీ చైర్మన్ జోయలుక్కాస్ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
ఎందుకు : రాజీవ్ గౌబా పదవీ కాలం ఇటీవల ముగియడంతో...
Published date : 10 Aug 2021 01:26PM