కే9 వజ్ర యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం
Sakshi Education
ప్రైవేట్ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర-హొవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 19న ప్రారంభించారు.
2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్‌వహా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
నేషనల్ మ్యూజియం ఆఫ్ సినిమా ప్రారంభం
ముంబైలో ఏర్పాటుచేసిన ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 19న ప్రారంభించారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కే9 వజ్ర యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హజీరా, గుజరాత్

Published date : 21 Jan 2019 06:18PM