కే-4 అణు క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే-4 బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది.
3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరం నుంచి జనవరి 19న ప్రయోగించారు. 2,500 కేజీల బరువున్న అణ్వాయుధాలను కే-4 క్షిపణి నుంచి ప్రయోగించవచ్చు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను అరిహంత్ రకం అణు జలాంతర్గాముల్లో మోహరించనున్నారు. వీటి చేరికతో జలాంతర్గాముల నుంచి శత్రు సామర్థ్యాన్ని దెబ్బతీయగల పాటవం మరింత మెరుగైనట్లేనని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కే-4 అణు క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : విశాఖపట్నం తీరం, ఆంధ్రప్రదేశ్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కే-4 అణు క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : విశాఖపట్నం తీరం, ఆంధ్రప్రదేశ్
మాదిరి ప్రశ్నలు
1. కల్పక్కం అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తరప్రదేశ్
2. గుజరాత్
3. తమిళనాడు
4. కర్ణాటక
- View Answer
- సమాధానం : 3
Published date : 20 Jan 2020 05:44PM