కడప యురేనియం పరిశ్రమకు జాతీయ అవార్డు
Sakshi Education
ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు కడప జిల్లా ఎం.తుమ్మలపల్లె వద్ద ఉన్న యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015 లభించింది.
కేంద్ర కార్మికశాఖ న్యూఢిల్లీలో డిసెంబర్ 16న నేషనల్ సేఫ్టీ అవార్డ్స్-2015, 2016 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా కడప యూరేనియం పరిశ్రమ మైనింగ్ మేనేజర్ కమలాకర్‌రావ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కడప యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు : ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కడప యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు : ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు
Published date : 17 Dec 2019 05:58PM