కార్లోస్ సెయింజ్‌తో టీమ్ ఫెరారీ ఒప్పందం
Sakshi Education
ఫెరారీ జట్టులో స్టార్ రేసర్‌గా వెలుగొందిన సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ) స్థానాన్ని కార్లోస్ సెయింజ్ (జూనియర్)తో భర్తీ చేశారు.

ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నట్లు ఫార్ములావన్ టీమ్ ఫెరారీ మే 14న వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం.. 2021, 2022 ఫార్ములావన్ రెండు సీజన్లలో సెయింజ్ ఫెరారీ స్టీరింగ్ చేపట్టనున్నాడు. ప్రస్తుతం మెక్‌లారెన్‌తో ఉన్న సెయింజ్ కాంట్రాక్ట్ 2020, ఏడాదితో ముగియనుంది. 2015లో టోరో రోసోతో తన ఫార్ములా కెరీర్‌ను ఆరంభించిన సెయింజ్... అనంతరం రీనాల్ట్, మెక్‌లారెన్ జట్లకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఫెరారీ జట్టు చీఫ్‌గా మాటియో బినోటో తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కార్లోస్ సెయింజ్‌తో ఒప్పందం
ఎప్పుడు : మే 14
ఎవరు : ఫార్ములావన్ టీమ్ ఫెరారీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కార్లోస్ సెయింజ్‌తో ఒప్పందం
ఎప్పుడు : మే 14
ఎవరు : ఫార్ములావన్ టీమ్ ఫెరారీ
Published date : 15 May 2020 06:50PM