కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
Sakshi Education
రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 2న సందర్శించారు.
కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ, రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పటేల్ (దాజీ) పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కాన్హా శాంతివనంలో నిర్మించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కాన్హా శాంతివనం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కాన్హా శాంతివనం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
Published date : 04 Feb 2020 05:09PM