కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
Sakshi Education
కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్(71) కన్నుమూశారు.
నెల రోజులుగా కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హరియాణలోని గురుగావ్‌లో నవంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికై న ఎన్నికైన పటేల్ ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు.
గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో 1949, ఆగస్టు 21 పటేల్ జన్మించారు. భరూచ్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1977లో 28ఏళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : అహ్మద్‌పటేల్(71)
ఎక్కడ : గురుగావ్, హరియాణ
ఎందుకు : కరోనా సంబంధిత సమస్యలతో

Published date : 26 Nov 2020 06:08PM