Skip to main content

కాంగ్రెస్ అధ్యక్షురాలికి ఎస్పీజీ భద్రత తొలగింపు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్రప్రభుత్వం నవంబర్ 8న ఉపసంహరించింది.
ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన దృష్ట్యా 1988లో ఎస్‌పీజీని స్థాపించారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్ల వరకూ ఈ రకమైన భద్రతను కల్పిస్తున్నారు. గత ఆగస్టులోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగింపు
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం

మాదిరి ప్రశ్నలు
1. మాజీ ప్రధానులు, వారి కుటుంబాల భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ)ను ఏ సంవత్సరం స్థాపించారు?
1. 1991
2. 1989
3. 1988
4. 1992
సమాధానం : 3

2. ఇటీవల ఏ మాజీ ప్రధానికి ఎస్పీజీ భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించింది?
1. హెచ్‌డీ దేవేగౌడ
2. మన్మోహన్ సింగ్
3. చరణ్ సింగ్
4. ఐకే గుజ్రాల్
సమాధానం : 2
Published date : 09 Nov 2019 06:05PM

Photo Stories