Skip to main content

కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్ వాయిదా

2020 ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో... ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 2021 ఏడాది జరగాల్సిన కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ను 2023కు వాయిదా వేశారు.
Current Affairs
2021 టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ 2021 ఆగస్టు 1 నుంచి 7 వరకు జరగాల్సింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌ దృష్ట్యా కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ను రెండేళ్లపాటు వాయిదా వేస్తున్నామని కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మే 1న‌ ప్రకటించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2023కు కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా
ఎప్పుడు : మే
ఎవరు : కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌
ఎక్కడ : ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో
ఎందుకు : 2020 ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో
Published date : 02 May 2020 07:31PM

Photo Stories