కాలాపానీ గ్రామం మాదే : నేపాల్
Sakshi Education
భారత ప్రభుత్వం 2019, నవంబర్ 2నవిడుదల చేసిన పటం(ఇండియా మ్యాప్)లో ‘కాలాపానీ’ గ్రామాన్ని భారత్‌లో ఉన్నట్లు చూపిందని, అయితే అది తమకు చెందినదంటూ నేపాల్ అభ్యంతరం లేవనెత్తింది.
కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్ జిల్లాలో ఉన్నట్లు భారత మ్యాపులో కనిపించగా, ఆ ప్రాంతం తమ దేశంలోని దార్చులా జిల్లాకు చెందినదని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 6న తెలిపింది. భారత ఎంబసీ అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు.
Published date : 07 Nov 2019 05:33PM