కాకినాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
Sakshi Education
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రూ.110 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా 154 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 1,500 డిస్పెన్సరీలు, 815 బ్రాంచ్ కార్యాలయాలు, 63 రీజినల్, సబ్ రీజనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. దేశంలోని కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. కార్మిక వర్గాలతోపాటు, పేదల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్
ఎక్కడ : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్
ఎక్కడ : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
Published date : 27 Feb 2020 05:19PM