Skip to main content

కాకినాడ పోర్టులో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్న సంస్థ? 

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Current Affairs
ముంబైకి చెందిన హెచ్‌.ఎనర్జీ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ‘ఈస్ట్‌కోస్ట్‌ కన్సెషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈసీపీఎల్‌)’ దీనిని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడి అంచనాతో భారీ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయనుంది. ఏటా 5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఈ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్నారు.

ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో.. టెర్మినల్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు (కేఎస్‌పీఎల్‌)ను 50 ఏళ్లపాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్‌పీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన పదేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్‌ ఏర్పాటు
ఎప్పుడు : జూలై 2
ఎవరు : హెచ్‌.ఎనర్జీ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ‘ఈస్ట్‌కోస్ట్‌ కన్సెషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈసీపీఎల్‌)
ఎక్కడ : కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, తూర్పు గోదావరి జిల్లా
Published date : 03 Jul 2021 06:03PM

Photo Stories