Skip to main content

ఝాన్సీ వ్యవసాయ వర్సిటీ భవనాలు ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలను ఆగస్టు 29న ఆన్‌లైన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Current Affairs
అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ మైక్రో నీడిల్ తయారు
ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణులు అత్యంత సన్నని మైక్రో నీడిల్‌ను తయారు చేశారు. ఈ సూదితో ఇంజెక్షన్ చేస్తే నొప్పే తెలియదని తయారీదారులు పేర్కొన్నారు. అత్యంత సన్నగా ఉన్నప్పటికీ శరీరానికి గుచ్చే సమయంలో విరిగి పోకుండా ఉండేలా బలమైన గాజు కార్బన్‌తో రూపొందించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
Published date : 31 Aug 2020 05:32PM

Photo Stories