జయశంకర్ అగ్రి వర్సిటీతో బేపాక్ సంస్థ ఒప్పందం
Sakshi Education
తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో హైదరాబాద్‌కు చెందిన బేపాక్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్, బేపాక్ ఫోర్‌ఎక్స్ సంస్థ డెరైక్టర్ ఉదయ్‌నదీవాడే నవంబర్ 3న పరస్పరం ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు. స్వల్పకాలిక వరి రకం తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్15408)ను 2015లో విడుదల చేశామని వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : బేపాక్ సంస్థ
ఎందుకు : తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : బేపాక్ సంస్థ
ఎందుకు : తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు
Published date : 04 Nov 2020 05:54PM