జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
Sakshi Education
సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ‘జయహో’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది ప్రింట్ ఎడిటర్ ఇన్‌చీఫ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శేఖర్ గుప్తా ఆవిష్కరించారు.
ఎమెస్కో ఆధ్వర్యంలో ఆగస్టు 12న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రపై జయహో పుస్తకాన్ని రూపొందించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జయహో పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది ప్రింట్ ఎడిటర్ ఇన్‌చీఫ్ శేఖర్ గుప్తా
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జయహో పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది ప్రింట్ ఎడిటర్ ఇన్‌చీఫ్ శేఖర్ గుప్తా
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 13 Aug 2019 05:21PM