జయేశ్ రంజన్‌కు ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు
Sakshi Education
స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కృషికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’అవార్డును అందుకున్నారు.
ఢిల్లీలోని స్వీడన్ రాయబార కార్యాలయంలో స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్, రాణి సిల్వియా డిసెంబర్ 4న జయేశ్ రంజన్‌కు ఈ అవార్డును అందజేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అవార్డును స్వీడన్ దేశ ప్రయోజనాలకు తోడ్పడే వారికి అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
ఎందుకు : స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కృషికి

Published date : 05 Dec 2019 05:34PM