జూలై 1 నుంచి జల్‌శక్తి అభియాన్
Sakshi Education
దేశవ్యాప్తంగా 2019, జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) ‘జల్‌శక్తి అభియాన్ (జేఎస్‌ఏ)’ అమలు చేయనున్నారు.
జల్‌శక్తి అభియాన్‌లో భాగంగా దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ జూన్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. జల్‌శక్తి అభియాన్ ద్వారా జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో జూన్ 26న జరిగిన చర్చలో ఆయన ఈ మేరకు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019, జూలై 1 నుంచి జల్‌శక్తి అభియాన్ అమలు
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జల సంరక్షణ కోసం

Published date : 27 Jun 2019 05:50PM