జర్మన్ హ్యాంగర్ విధానంలో నిర్మించిన కోవిడ్ ఆస్పత్రి ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
కరోనా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ పరిశ్రమ వద్ద రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జర్మన్ హ్యాంగర్స్ విధానంలో 500 ఆక్సిజన్ పడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మన్హ్యాంగర్ విధానంలో నిర్మించిన కోవిడ్ ఆస్పత్రి ఎక్కడ ప్రారంభమైంది?
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ పరిశ్రమ వద్ద
ఎందుకు :కరోనా రోగులకు వైద్య సేవలు అందించేందుకు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 4న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఆర్జాస్ స్టీల్‌కు ఉన్న ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ద్వారా రోజూ దాదాపుగా వచ్చే 100 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని జర్మన్ హ్యాంగర్‌లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పని చేశారు.’ అంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని అభినందించారు.
రికార్డు సమయంలో ఏర్పాటు...
రికార్డు సమయంలో ఏర్పాటు...
- కేవలం రెండు వారాల వ్యవధిలో 11.50 ఎకరాల విస్తీర్ణంలో, లక్ష చదరపు అడుగుల్లో ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇందులోని 500 పడకలకూ ఆక్సిజన్ సదుపాయం ఉంది. మేఘా గ్రూపు వారు సాంకేతిక సహకారం అందించారు.
- అనంతపురం జిల్లాతో పాటు వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన రోగులకు కూడా ఇక్కడ బెడ్లు కేటాయిస్తారు. ప్రతి పెషెంట్ బెడ్ వద్ద ఆక్సిజన్, ప్రతి 30 బెడ్లకు ఓ నర్సింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
- 200 మంది నర్సులు, 50 మందికి పైగా వైద్యులు.. మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మన్హ్యాంగర్ విధానంలో నిర్మించిన కోవిడ్ ఆస్పత్రి ఎక్కడ ప్రారంభమైంది?
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ పరిశ్రమ వద్ద
ఎందుకు :కరోనా రోగులకు వైద్య సేవలు అందించేందుకు...
Published date : 05 Jun 2021 06:24PM