జపాన్ ప్రధానితో మోదీ సమావేశం
Sakshi Education
జీ20 సదస్సు కోసం జూన్ 27న జపాన్‌లోని ఓసాకా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జూన్ 28 నుంచి రెండ్రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది.
జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో జూన్ 27న భారత సంతతి ప్రజలతోనూ మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జపాన్ ప్రధాని షింబో అబేతో సమావేశం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఓసాకా, జపాన్

Published date : 28 Jun 2019 06:12PM