జపాన్ గ్రాండ్ ప్రి విజేత బొటాస్
Sakshi Education
జపాన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు.
జపాన్‌లో అక్టోబర్ 13న జరిగిన 53 ల్యాప్‌ల ప్రధాన రేసును బొటాస్ అందరి కంటే ముందుగా గంటా 21 నిమిషాల 46.755 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ రేసులో వెటెల్ రెండో స్థానంలో... మరో మెర్సిడెస్ డ్రెవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. తాజా రేసుతో మెర్సిడెస్ జట్టు మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే 2019 కన్‌స్ట్రక్టర్స్ టీమ్ టైటిల్‌ను దక్కించుకుంది.
Published date : 14 Oct 2019 05:56PM