Skip to main content

జపాన్ బ్యాంక్ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు?

జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్(జేబీఐసీ) నుంచి తాజాగా పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ బిలియన్ డాలర్ల(రూ. 7,350 కోట్లు) రుణాన్ని పొందింది.
Current Affairs
ఈ నిధులను దేశీయంగా కోవిడ్‌–19 వల్ల సవాళ్లు ఎదుర్కొంటున్న జపనీస్‌ ఆటో రంగ కంపెనీలకు రుణాలుగా ఎస్‌బీఐ అందించనుంది. 2020 అక్టోబర్‌లోనూ జేబీఐసీ నుంచి ఎస్‌బీఐ బిలియన్‌ డాలర్ల రుణాన్ని సమకూర్చుకుంది. దీంతో 2 బిలియన్‌ డాలర్లను పొందినట్లయ్యింది. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా దినేష్‌ కుమార్‌ ఖారా ఉన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్లు
ఆహారశుద్ధి పరిశ్రమ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) కు ఉత్పత్తి ఆధారిత పథకాన్ని (పీఎల్‌ఐ స్కీమ్‌) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలను ఆరేళ్ల పాటు 2026–27 నాటి వరకు అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : జపాన్‌ బ్యాంక్‌ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఎందుకు : దేశీయంగా కోవిడ్‌–19 వల్ల సవాళ్లు ఎదుర్కొంటున్న జపనీస్‌ ఆటో రంగ కంపెనీలకు రుణాలుగా అందించేందుకు
Published date : 01 Apr 2021 06:34PM

Photo Stories