జొకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్
Sakshi Education
సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగం టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ రాడ్‌లేవర్ ఎరీనాలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎనిమిదోది. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019లలో చాంపియన్‌గా నిలిచాడు. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ థీమ్‌కు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 04 Feb 2020 05:11PM