Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 5th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 5th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Brazil President: బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డా సిల్వా 
బ్రెజిల్‌ దేశ 39వ‌ అధ్యక్షుడిగా లులా డా సిల్లా జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. లులా డ సిల్వా పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా. గతంలో ఆయ‌న 2003 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మిలియన్ల మంది బ్రెజిలియన్లు పేదరికం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసిన నాయకుడిగా ఘనత పొందారు. లులా మనీలాండరింగ్‌ సంబంధించి భారీ అవినీతి కుంభకోణంలో చిక్కుకొని సుమారు ఏడాదిన్నర జైలు జీవితం గడిపాడు. అయితే 2019లో ఈ కేసు కొట్టివేయబడింది. ఈ కేసులో న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారనే కారణంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అతని నేరారోపణను రద్దు చేసింది. 

Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు

Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు
జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద కేంద్ర ప్ర‌భుత్వం జనవరి 1, 2023 నుంచి ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనుంది. దీనికి సంబందించి డిసెంబ‌ర్ 30న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, ఆహార మరియు ప్రజాపంపిణీ, వాణిజ్యం, పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై రూ.2 లక్షల కోట్ల భారం పడనుంది. ఆహార ధాన్యాల కోసం ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. గతంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించేవారు. అయితే తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇకపై పేదలు ఉచితంగా వీటిని పొందుతారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్రమే భరించనుంది. 

ఇప్పటికే కోవిడ్, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. ఈ పథకం కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా COVID 19 మహమ్మారి లాక్‌డౌన్‌  మధ్య పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం ఏప్రిల్ 2020 నుంచి మూడు నెలల పాటు ప్రారంభించింది. అప్పటి నుంచి పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే 5 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ఆరు దశలలో ఈ పథకం కోసం రూ.3.45 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Eating Organism: వైరస్‌లను భోంచేస్తుంది.. వింత సూక్ష్మజీవి ఉనికిని గుర్తించిన సైంటిస్టులు 
వైరస్‌లనే లంచ్‌లోకి నమిలి మింగేసే ఒక వింత జీవి ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నీళ్లలో తమ పరిధిలో ఉన్న నానా రకాల క్లోరో వైరస్‌లనూ అదీ ఇదీ అని లేకుండా ఇది భారీ సంఖ్యలో తినేస్తుందట! ఈ సూక్ష్మ జీవిని యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రాస్కా–లింకన్స్‌ పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసే హాల్టేరియా అనే సూక్ష్మజీవుల్లో ఓ జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది మరో భోజనంతో పని లేకుండా కేవలం వైరస్‌లను మాత్రమే తిని సుష్టుగా పెరుగుతుందని, తమ సంతతినీ వృద్ధి చేసుకుంటోందని వారి పరిశోధనల్లో తేలడం విశేషం. 

Spacewalk: స్పేస్‌ వాక్‌.. ఐఎస్‌ఎస్‌కు సోలార్‌ ప్యానళ్ల బిగింపు
పరిశోధనలో భాగంగా ఓ మంచినీటి కొలను నుంచి నీటిని సేకరించారు. అందులోకి క్లోరో వైరస్‌లను వదిలారు. కొంతకాలానికి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటం వారిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మరో రకం సూక్ష్మజీవులు పరిమాణంలో మామూలు కంటే ఏకంగా 15 రెట్లు పెరిగిపోతున్న వైనమూ కంటబడింది. వాటిని హాల్టేరియాగా గుర్తించారు. తినడానికి మరేమీ అందుబాటులో లేకపోవడంతో అవి హాయిగా క్లోరో వైరస్‌లనే తిని అరాయించుకుని అంతలా పెరిగాయట! ఈ పరిశోధన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడెమీ సైన్సెస్‌’లో పబ్లిషైంది. దీని ఫలితాలు ఆహారచక్రం గురించిన మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తాయని పరిశోధన బృందానికి చెందిన డాక్టర్‌ డిలాంగ్‌ అంటున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Risk Of Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్‌ 
మీ రక్తం ఏ గ్రూప్‌..? దానిని బట్టి మీకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఎంతో చెప్పేయొచ్చు. ఎ గ్రూప్‌ రక్తం ఉన్న వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో మనిషి రక్తంలో గ్రూప్‌కి, స్ట్రోక్‌కి మధ్య సంబంధం ఉందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను మెడికల్‌ జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ప్రచురించింది. ఒక మనిషి రక్తం గ్రూప్‌కు సంబంధించిన జన్యు రకాలను, మెదడు సహా ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే స్ట్రోక్స్‌కు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
☛ ఒక వ్యక్తి రక్తం గ్రూప్‌ ఎ అయితే 60 ఏళ్ల కంటే ముందుగానే స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్‌ కలిగిన వారి రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. మిగతా గ్రూప్‌ల వారి కంటే స్ట్రోక్‌ వచ్చే అవకాశం 16% ఎక్కువ.  
☛ ఓ–బ్లడ్‌ గ్రూప్‌ వారు నిశ్చింతగా ఉండొచ్చు. వారికి స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. మిగతా గ్రూప్‌ల కంటే రిస్క్‌ 12% తక్కువ.
☛ బి గ్రూప్‌ రక్తం ఉన్న వారికి ఏ వయసులోనైనా స్ట్రోక్‌ వచ్చే అవకాశాలున్నాయి.  
☛ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో బ్రెయిన్‌ స్ట్రోక్స్‌పై జరిగిన 48పైగా అధ్యయనాలను విశ్లేషించి తాజా నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనాల్లో 18 నుంచి 59 వరకు వయసు కలిగిన వారు ఉన్నారు. గతంలో ఒ గ్రూప్‌ కాని వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశాలున్నా యని తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ బ్రాక్స్టన్‌ మిచెల్‌ చెప్పారు.

Aadhaar Update: ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు ఇక‌ చాలా సులువు
Green Hydrogen Mission: గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.19,744 కోట్లు 
దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది. దీంతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్‌ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్‌, ఆయిల్‌ రిఫైనరీలు, స్టీల్‌ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్‌ చెప్పారు. ఈ మిషన్‌ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్‌ ఇంటర్‌వెన్షన్స్‌ ఫర్‌ గ్రీన్‌ హైబ్రోజన్‌ ట్రాన్సిషన్‌ (సైట్‌) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్‌ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్‌ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్‌ సాకారమైతే ఇంధన రంగంలో భారత్‌ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది.   

Pakistan Economic Crisis: సంక్షోభంలో పాక్‌.. మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్‌ హాళ్లు త్వరగా మూసేయాలని ఆదేశం 
చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు.. ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్‌ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది.. 

Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
పాకిస్తాన్‌లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది. మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ జ‌న‌వ‌రి 4వ తేదీ ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్‌ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్‌ మాల్స్‌ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌ అసిఫ్‌ వెల్లడించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 

Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌..! 
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టిని (51) అధ్యక్షుడు జో బైడెన్‌ పునర్మియమించారు. ఎరిక్‌ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది. లాస్‌ ఏంజెల్స్‌ మాజీ మేయర్‌ అయిన ఎరిక్‌ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో 2021 జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో రిపబ్లికన్‌ సెనేటర్‌ చక్‌ గ్రాసిటీ అడ్డుకున్నారు. మరోవైపు తన పాలనా విభాగంలోని కీలక పదవుల్లో అరడజనుకిపైగా ఇండియన్‌ అమెరికన్లను బైడెన్ జ‌న‌వ‌రి 3న రీ నామినేట్‌ చేశారు. బైడెన్‌ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ రిసోర్సెస్‌ పదవికి రిచర్డ్‌ వర్మ, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రతినిధిగా డాక్టర్‌ వివేక్‌ హాలెగెరె మూర్తి (45)ని రీ నామినేట్‌ చేస్తూ సెనేట్‌ ఆమోదానికి పంపించారు. వీరే కాకుండా ప్రవాస భారతీయులైన అంజలి చతుర్వేది, రవి చౌధరి, గీతా రావు గుప్తా, రాధా అయ్యంగార్‌లను ప్రభుత్వంలో వివిధ పదవులకు రీ నామినేట్‌ చేస్తూ సెనేట్‌కు పంపించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Captain Shiva Chouhan: సియాచిన్‌పై వీర వనిత.. తొలి మహిళా సైనికాధికారిగా రికార్డు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్‌ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్‌ శివ చౌహాన్‌ ఈపోస్ట్‌ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్‌ వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Published date : 05 Jan 2023 06:35PM

Photo Stories