Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 4th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 4th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Cinema Hall: సినిమా హాళ్లలో తినుబండారాలపై నిషేధం.. సుప్రీం
సినిమా హాళ్లలోకి బయటి నుంచి తినుబండారాలను అనుమతించే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సినిమా హాల్‌ అనేది ప్రైవేట్‌ ఆస్తి అని, అందులోకి బయటి తినుబండారాలను అనుమతించాలా? లేదా? అనేది నిర్ణయంచుకొనే హక్కు యాజమాన్యానికి ఉందని తేల్చిచెప్పింది. ప్రేక్షకులు బయటి నుంచి తినుబండారాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకోరాదని, అందుకు అనుమతించాలని ఆదేశిస్తూ జమ్మూకశ్మీర్‌ హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ థియేటర్‌ ఓనర్లు, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జమ్మూకశ్మీర్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలకు అవసరమైన ఆహారాన్ని తల్లిదండ్రులు సినిమా హాల్లోకి తీసుకొస్తే అడ్డుకోవద్దని స్పష్టం చేసింది.    

Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..

Indian Science Congress: 108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం  
భారత్‌ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ను ఆయన జ‌న‌వ‌రి 3న‌ ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్‌ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు.  


ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 40వ స్థానం  
సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్‌ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్‌ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్‌ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్‌ కంపెనీలు, స్టార్టప్‌లను రీసెర్చ్‌ ల్యాబ్‌లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. మన దేశంలో ఇంధన, విద్యుత్‌ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్‌ సమాజానికి పిలుపునిచ్చారు. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు.

PM Modi: రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన

Supreme Court: మంత్రుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేం.. సుప్రీంకోర్టు 
ప్రజాప్రతినిధుల వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భావ ప్రకటనపై ఇప్పటికే ఆర్టికల్‌ 19(2)లో ఉన్నవాటికి అదనంగా మరిన్ని పరిమితులు విధించలేం. సమష్టి బాధ్యత సూత్రాన్ని ఈ విషయంలో వర్తింపజేయలేం’’ అని స్పష్టం చేసింది. ఒక మంత్రి చేసే విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొంది. ఓ సామూహిక అత్యాచారం కేసుపై విద్వేష వ్యాఖ్యలు చేసిన అప్పటి యూపీ మంత్రి ఆజం ఖాన్‌ను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జ‌న‌వ‌రి 3న ఈ మేరకు 4–1తో మెజారిటీ తీర్పు వెలువరించింది. భారత్‌ వంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఆరోగ్యకర ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అత్యవసరమని జస్టిస్‌ నజీర్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. ఐదో సభ్యురాలైన జస్టిస్‌ నాగరత్న మాత్రం, మంత్రి అధికారిక హోదాలో చేసే వ్యాఖ్యలను మొత్తం ప్రభుత్వానికి ఆపాదించవచ్చంటూ భిన్నమైన తీర్పు వెలువరించారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Aadhaar Update: ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు ఇక‌ చాలా సులువు
ఆధార్‌ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటి పెద్ద(హెడ్‌ ఆఫ్‌ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్‌ పోర్టల్‌లో (ఆన్‌లైన్‌లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్‌ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్‌ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్‌–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్‌లో ఉండాలి. ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Netanyahu: నెతన్యాహు దంపతులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపిక చేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్‌ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జ‌న‌వ‌రి 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానం చేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్‌ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఐజాక్‌ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్‌ పెరీస్ సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Russian Celebrities: ఆత్మ'హత్య'లేనా..? మిస్టరీగా ప్రముఖుల మరణాలు..!

రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. ఒకరో, ఇద్దరో మరణించారనుకుంటే ఏమో అనుకోవచ్చు. గత ఏడాది కాలంలో ఏకంగా 24 మంది మృత్యువాత పడడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించడానికి కాస్త ముందు నుంచే ఈ మిస్టరీ మరణాలు సంభవించడం గమనార్హం. ఇలా మరణించిన ప్రముఖుల్లో కొందరు పుతిన్‌ యుద్ధోన్మాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించినవారు ఉన్నారు. దీంతో పుతిన్‌ను ఎదిరిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అన్న చర్చ కూడా జరుగుతోంది.  
భారత్‌లో 15 రోజుల్లో ముగ్గురు  
మన దేశంలోని ఒడిశా రాష్ట్రంలో గత పదిహేను రోజుల్లో ముగ్గురు రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. పారాదీప్‌ ఓడరేవులో ప్రయాణిస్తున్న నౌక సిబ్బందిలో ఒకరైన సెర్జీ మిల్యాకోవ్‌ (50) జ‌న‌వ‌రి 3 తెల్లవారుజామున నౌకలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్‌ పోర్టు నుంచి పారాదీప్‌ మీదుగా ముంబై వెళుతున్న ఆ నౌకకి సెర్జీ చీఫ్‌ ఇంజనీర్‌. తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన శవమై కనిపించారు. సెర్జీ గుండెపోటుతో మరణించారని నౌకా సిబ్బంది భావిస్తున్నారు. ఒడిశాలోని రాయగడ సాయి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఇద్దరు రష్యన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే మరో మరణం సంభవించింది. రష్యా వ్యాపారి, ఎంపీ పావెల్‌ ఆంటోవ్‌ (65)డిసెంబర్‌ 24న హోటల్‌ గది కిటికీలో నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. అంతకు రెండు రోజుల ముందే డిసెంబర్‌ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమర్‌ బెడెనోవ్‌ (61) హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో కనిపించి ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచారు.  
ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖులెవరు ?  
ప్రాణాలు కోల్పోతున్న రష్యన్లలో బిలయనీర్లు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, చమురు సంస్థల అధిపతులు, పెద్ద పెద్ద పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, మిలటరీ నాయకులు ఉన్నారు.  మ‌రిన్ని వివరాలకు ఇక్క‌డ క్లిక్ చేయండి

ఆర్థిక ఒత్తిళ్లు కారణమా ?  
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో వ్యాపారాలు బాగా దెబ్బతిని బిలయనీర్లందరూ ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన వారంతా తమ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటాయన్న నమ్మకం లేని తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, ఆరోగ్యం క్షీణించి గుండెపోట్లు రావడం జరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో చమురు సంస్థలకు చెందిన  ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.  

ITTF World Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో మనిక బత్రా 
అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ మనిక బత్రా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. జ‌న‌వ‌రి 3న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్‌ 136వ ర్యాంక్‌ లో ఉన్నాడు. సత్యన్‌ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.

ICC Test Rankings: నాలుగో స్థానానికి అశ్విన్‌


Jaydev Unadkat: జైదేవ్‌ ఉనాద్కట్ రికార్డు.. మొదటి ఓవర్లోనే ‘హ్యాట్రిక్‌’ సాధించిన తొలి బౌలర్‌గా ఘనత

క్రికెట్‌లో ‘హ్యాట్రిక్‌’లు, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొత్తేం కాదు.. కానీ ఆట మొదలైన ఓవర్లోనే వరుసగా మూడు వికెట్లు (హ్యాట్రిక్‌) తీస్తే.. ఆ ముగ్గురు డకౌట్‌ అయితే అది చరిత్ర! అలాంటి ఘనమైన రికార్డును సౌరాష్ట్ర సీమర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ (8/39) ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో లిఖించాడు. 88 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో జ‌న‌వ‌రి 3న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ మూడో బంతికి ధ్రువ్‌ శోరే (0)ను, నాలుగో బంతికి వైభవ్‌ (0)ను, ఐదో బంతికి యశ్‌ ధుల్‌ (0)ను అవుట్‌ చేశాడు. తన మరుసటి ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ మళ్లీ పంజా విసిరాడు. జాంటీ సిద్ధు (4)తోపాటు లలిత్‌ యాదవ్‌ (0)నూ స్కోరు చేయనివ్వలేదు. మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 5/6. మళ్లీ ఐదో ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ లక్ష్యయ్‌ (1)ను పెవిలియన్‌ చేర్చాడు. 10 పరుగులకే ఢిల్లీ 7 వికెట్ల‌ను కోల్పోయింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Granules Investments: ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ ప్లాంట్‌ 
ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి, గ్రీన్‌కో గ్రూప్‌ ఫౌండర్‌ మహేశ్‌ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.   

JSW Steel Plant: కడపలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారం


Satya Nadella: డిజిటైజేషన్‌లో భారత్‌ భేష్‌.. మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల 
డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్‌ అసాధారణ రీతిలో కృషి చేస్తోందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి సాధనలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) గణనీయంగా తోడ్పాటునివ్వగలవని ఆయన తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ లీడర్‌షిప్‌ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. 2025 నాటికి చాలా మటుకు అప్లికేషన్లు క్లౌడ్‌ ఆధారిత మౌలిక సదుపాయాలతో రూపొందుతాయని, సుమారు 90 శాతం డిజిటల్‌ పని అంతా క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌పైనే జరుగుతుందన్నారు. ‘ఈ నేపథ్యంలోనే మేము ప్రపంచవ్యాప్తంగా 60 పైగా రీజియన్లు, 200 పైగా డేటా సెంటర్లపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. భారత్‌లో మరింతగా విస్తరిస్తున్నాం. హైదరాబాద్‌లో మా నాలుగో రీజియన్‌ ఏర్పాటు చేస్తున్నాం. క్లౌడ్‌ను అంతటా అందుబాటులోకి తేవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని నాదెళ్ల చెప్పారు. 2020 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల .. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. 

Nirmala Sitharaman: చెలామణిలో ఉన్న నోట్ల విలువ.. రూ.31.92 లక్షల కోట్లు
కృత్రిమ మేధ హవా.. 
ఆటోమేషన్‌ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ చాలా కీలకంగా మారగలదని నాదెళ్ల చెప్పారు. ‘ముందుగా మనకు భారీ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలి. అది లేకుండా ఏఐ ప్రయోజనాలను పొందలేము. అందుకే మేము మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాం‘ అని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండటం, మార్కెట్‌ శక్తులు దానికి తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తుండటం వంటి అంశాలు భారత్‌కు సానుకూలమైనవని అభిప్రాయపడ్డారు. రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం దేశీయంగా పబ్లిక్‌ క్లౌడ్‌ సర్వీసుల మార్కెట్‌ 2026 నాటికి 13 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. 2021–26 మధ్య కాలంలో ఏటా 23.1 శాతం వృద్ధి నమోదు చేయనుంది. భారత్‌లోని టాప్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్ సర్వీసు ప్రొవైడర్లలో అమెజాన్‌ వెబ్ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ఉన్నాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

 

Published date : 04 Jan 2023 06:33PM

Photo Stories