Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 31st, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 31st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Economic Survey: ఆర్ధిక సర్వే అంటే ఏమిటి? తొలి సర‍్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తుంది. జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ పత్రాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 
ఆర్ధిక సర్వే అంటే ఏమిటి?
ఈ సందర్భంగా బడ్జెట్‌ను సమర్పించే ముందు గత సంవత్సరంలో సాధించిన ఆర్థిక అభివృద్ధి, రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లు, పరిష్కారాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేగా (ఎకానమీ సర్వే) పిలువబడే ఒక పత్రాన్ని పార్లమెంటులో సమర్పిస్తారు. 

Oxfam International: 1 శాతం మంది గుప్పిట్లో.. 40% దేశ సంపద!
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ)లోని ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఎకనమిక్ సర్వేను రూపొందిస్తుంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) ఆర్థిక సర్వే బాధ్యతలు చూసుకుంటారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం రూపొందించిన ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించారు.   
తొలి సర‍్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?
1950-51లో మొదటి ఆర్థిక సర్వేని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎకానమీ సర్వే నివేదిక విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్‌తో కలిపి దీనిని ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్‌ నుంచి దీనిని విడదీశారు. ప్ర‌స్తుతం ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారుగా వి అనంత నాగేశ్వరన్ ఉన్నారు. 
రెండు విడతల్లో.. 
జ‌న‌వ‌రి 31 నుంచి జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోని తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 6 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడుత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు.. రెండో విడుత మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 16 వరకు కొనసాగనున్నాయి. ఇలా మొత్తం కలిపి 27 రోజులు పాటు జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఊరట కల్పించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని దేశ ప్రజలు ఎంతో ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (01-07 జనవరి 2023)

Food Processing Unit: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా తెలంగాణ
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం దండుపల్లిలో జ‌న‌వ‌రి 30వ తేదీ  రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌పూరితో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా ఆవిర్భవిస్తోందని కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు.  

Amazon Web Services: తెలంగాణలో అమెజాన్‌ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.36వేల కోట్లు
కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. 
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.  
20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌..
పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ కోసం ప్రత్యేకంగా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. 

Sir Chhotu Ram Award: సీఎం కేసీఆర్‌కు ‘సర్‌ ఛోటూ రామ్‌’ అవార్డు

Taliban Suicide Attac: మసీదులో తాలిబన్‌ ఆత్మాహుతి దాడి.. 61 మంది దుర్మరణం 
పాకిస్తాన్‌లో తాలిబన్లు దారుణ దాడికి తెగబడ్డారు. జ‌న‌వ‌రి 30న‌ పెషావర్‌లో  ప్రార్థనాల కోసం మసీదుకు చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్‌ ఆత్మాహుతి బాంబర్‌ జరిపిన దాడిలో ఏకంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు, భద్రత, ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. దాడి జరిగిన మసీదు నగరంలోని పోలీస్‌ లైన్స్‌ ప్రాంత పోలీస్‌ ఆఫీస్‌ సమీపంలో ఉంది. దాంతో ఈ మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల్లో ఎక్కువ మంది పోలీసు, ఆర్మీ, బాంబ్ నిర్వీర్య దళాల సభ్యులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో గత ఏడాది ఆగస్టులో తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానీని చంపినందుకు ప్రతీకారంగా పెషావర్‌ పేలుడు జరిపామని ఖలీద్‌ సోదరుడు ప్రకటించారు.
పేలుడు ధాటికి మసీదు కొంత నేలకూలింది. ఈ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఎస్పీ ఆఫీస్‌ పక్కనే ఉన్న ఈ మసీదుకు భద్రత ఎక్కువ. మసీదులో నాలుగు అంచెల భద్రత వలయం దాటుకుని మరీ ఆత్మాహుతి బాంబర్‌ లోపలికొచ్చి దాడి చేయడం గమనార్హం. దాడి సమయానికి ఆ మసీదు లోపల, బయట కలిపి మొత్తంగా 300–400 మంది పోలీసులు ఉండొచ్చని పెషావర్‌ సిటీ పోలీస్‌ ఆఫీసర్‌ ముహమ్మద్‌ ఇజాజ్‌ ఖాన్‌ చెప్పారు. దాడి ఘటనను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (01-07 జనవరి 2023)


Missile Strike: క్షిపణి దాడికి ఒక్క నిమిషం చాలు.. మాజీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌కు పుతిన్‌ వార్నింగ్‌
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను ఎలాగైనా నిలువరించేందుకు ప్రయత్నించిన బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ను పుతిన్‌ బెదిరించారి బీబీసీ డాక్యుమెంటరీ చెబుతోంది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం తొలినాళ్లలో పుతిన్‌కు, బోరిస్‌కు మధ్య జరిగిన ఫోన్‌కాల్‌ సంభాషణలు, పశ్చిమ దేశాలతో పుతిన్‌ నేతృత్వంలోని రష్యా వైఖరిని వెల్లడిస్తూ బీబీబీ ‘పుతిన్‌ వర్సెస్‌ ది వెస్ట్‌’ పేరిట ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. బీబీసీతో బోరిస్, బ్రిటన్‌ రక్షణ మంత్రి, పలువురు తెలిపిన వివరాలతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ జ‌న‌వ‌రి 30వ తేదీ ప్రసారమైంది.
డాక్యుమెంటరీ వెల్లడించిన విషయాల్లో కొన్ని..
• యుద్ధం మొదట్లోనే అంటే గత ఏడాది ఫిబ్రవరిలో పుతిన్‌కు బోరిస్‌ ఫోన్‌చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు స్వస్తి పలకాలని హితవు పలికారు. దానికి ససేమిరా ఒప్పుకోని పుతిన్‌ ఏకంగా బోరిస్‌ను బెదిరించారు!. ‘ బోరిస్‌.. మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదుగానీ క్షిపణితో(అలాంటి) దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు నాకు. ఇది త్వరలో వర్తమానప్రపంచంలో దారుణ విపత్తుగా పరిణమించబోతోంది’ అని అన్నారు. 
• బోరిస్‌ సంయమనం కోల్పోకుండా చర్చలకు ప్రాధాన్యమిస్తూనే దీటుగా బదులిచ్చారు.
• ‘వెనక్కి వెళ్లకపోతే రష్యాపై పశ్చిమ దేశాలు అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తాయి. నాటో సేనలు రష్యా సరిహద్దులను చుట్టుముడతాయి. సరైన భవిష్యత్తు లేనపుడు ఉక్రెయిన్‌ నాటోలో చేరబోదు’ అని అన్నారు.
• బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలేస్‌ కూడా మాస్కోకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం రాబోతోందని ఆనాడే అంచనావేశారు.
• పుతిన్, బోరిస్‌ తాలూకు ఈ ఫోన్‌కాల్‌ వివరాలను బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం, రష్యా అధికారికంగా ఎప్పుడూ వెల్లడించకపోవడం గమనార్హం.

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

Khelo India: ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’
ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ (ఎస్‌ఎఫ్‌ఏ) జతకట్టింది. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ.12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఏ వ్యవస్థాపకులు రిషికేశ్‌ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్‌ఎఫ్‌ఏ స్పాన్సర్‌షిప్‌ లభించడంపై స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్‌ఎఫ్‌ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది.   

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం

Graham Reid: భారత హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ పదవికి గ్రాహమ్‌ రీడ్‌ రాజీనామా
నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ చేరకపోవడం.. చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్‌ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్‌ ఒలింపిక్స్‌ ఉండటం.. ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కనున్న నేపథ్యంలో హెచ్‌ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది. హెచ్‌ఐ భవిష్యత్‌ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్‌ కోచ్‌ గ్రెగ్‌ క్లార్క్, సైంటిఫిక్‌ అడ్వైజర్‌ మిచెల్‌ డేవిడ్‌ పెంబర్టన్‌ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి సమర్పించారు. ఆ్రస్టేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్‌ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరకపోవడం.. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు

Tata Steel Chess Tournament: టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేతగా అనీశ్‌ గిరి   
ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ఆన్‌జీ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ నాలుగు పాయింట్లు సాధించి చివరిదైన 14వ స్థానంలో నిలిచాడు. మొత్తం 13 గేముల్లో అర్జున్‌ ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదు గేముల్లో ఓడిపోయాడు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జ‌రిగింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (01-07 జనవరి 2023)

Published date : 31 Jan 2023 06:05PM

Photo Stories