Daily Current Affairs in Telugu: జనవరి 2nd, 2023 కరెంట్ అఫైర్స్
Elon Musk: పేరుకే ప్రపంచ కుబేరుడు.. ఆఫీసు అద్దె కూడా కట్టలేడు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది! హార్ట్ఫోర్డ్ బిల్డింగ్లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్ తాఖీదులిచ్చింది. గడువులోగా చెల్లించకపోవడంతో ట్విట్టర్పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 13న ఓ కథనం ప్రచురించింది. రెండు చార్టర్ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్పై కేసు నమోదైంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
NASA: 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ..
ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. జనవరి 26 నుంచి వారం పాటు మామూలు కంటికి కూడా కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. సి2022 ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. అన్నట్టూ, భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట! 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కని్పంచేంత సమీపంగా వచ్చింది.
Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం కోల్పోయిన మస్క్
North Korea: క్షిపణి ప్రయోగంతో కొత్త ఏడాదికి స్వాగతం..
ప్రపంచ దేశాలన్నీ బాణసంచా వెలుగులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడితే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం క్షిపణి ప్రయోగంతో స్వాగతం పలికారు. డిసెంబర్ 31న ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నిర్వహించింది. అది 400 కిలోమీటర్లు ప్రయాణించి, కొరియా ద్వీపకల్పం–జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వ్రస్తాలను కలిగి ఉండాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికాను కిమ్ శత్రుదేశంగా పరిగణిస్తున్నారు. ఆయుధ శక్తితో అమెరికాకు బుద్ధి చెప్పడమే తమ లక్ష్యమని తరచుగా చెబుతున్నారు. ఉత్తర కొరియా సైన్యం గత ఏడాది 70కి పైగా క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో 3 షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను దక్షిణ కొరియా గుర్తించింది. త్వరలో తొలి నిఘా ఉపగ్రహం(శాటిలైట్) ప్రయోగానికి కిమ్ సైన్యం సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Unemployment Rate: దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
భారత్లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్లో 8.96 ఉంటే, డిసెంబర్ వచ్చేసరికి 10.09 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.
Mysterious Circles: మార్మిక వృత్తాల గుట్టు వీడింది
Police constable: దేవుడా ఏమిటీ పరీక్ష.. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం.. మరీ ఇంత మందా!
పాకిస్తాన్లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. ప్రతీ చోట నిరుద్యోగ సమస్య యువతను పీడిస్తోంది. కాగా పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది.
Chalapathi Rao: పీవీ చలపతిరావు కన్నుమూత
రెండుసార్లు ఎమ్మెల్సీగా, బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా సేవలు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జనవరి 1న విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడు పి.వి.ఎన్.మాధవ్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొసాగుతున్నారు. 1935 జూన్ 26న జన్మించిన చలపతిరావు పదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి చురుకైన పాత్ర పోషించారు. 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి పలుమార్లు అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఉత్తర సర్కారు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 1974లోను, 1980లోను శాసనమండలికి ఎన్నికయ్యారు. చలపతిరావు పార్ధివదేహాన్ని ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం విశాఖ పిఠాపురం కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు.
Pakistani Boat: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాకిస్థాన్ బోటు
Benedict XVI: బెనెడిక్ట్–16 అస్తమయం
మాజీ పోప్ బెనెడిక్ట్–16(95) డిసెంబర్ 31న వాటికన్లో తుది శ్వాస విడిచారు. ‘‘గౌరవ విశ్రాంత పోప్ వాటికన్లోని మాటర్ ఎక్లెసియా ఆరామంలో పరమపదించారని చెప్పేందుకు ఆవేదనగా ఉంది’’ అంటూ వాటికన్ అధికార ప్రతినిధి మటెయో బ్రూనీ ప్రకటన విడుదల చేశారు. ఆయన భౌతిక కాయాన్ని జనవరి 2వ తేదీ నుంచి అభిమానులు, విశ్వాసుల సందర్శనార్ధం సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఉంచి జనవరి 5న సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ పోప్కు ప్రస్తుత పోప్ అంతిమ సంస్కారాలు జరిపిన అరుదైన సన్నివేశంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. బెనెడిక్ట్ కోరిన విధంగా కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్టు వాటికన్ పేర్కొంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైనది తేదీలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
Omicron Super Variant: భారత్లోకి బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్
ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరం
చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలి కేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది.
ఏమిటీ ఎక్స్బీబీ.1.5?
ఒమిక్రాన్లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచి్చంది. బీక్యూ, ఎక్స్బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్బీబీ.1.5 వచ్చింది. ఎక్స్బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు.
లక్షణాలివే..!
ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి.
Covid Cases: జనవరిలో పెరగనున్న కరోనా కేసులు.. జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
Chinta Devi: గయ డిప్యూటీ మేయర్గా పారిశుద్ధ్య కార్మికురాలు
పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్సభకు పంపారు.
Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్తో రొనాల్డో ఒప్పందం
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో యూరోప్లోని విఖ్యాత క్లబ్లకు ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి ఆసియాకు చెందిన ఫుట్బాల్ క్లబ్తో ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్తో రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రొనాల్డో ఒప్పందం మొత్తాన్ని అల్ నాసర్ క్లబ్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందం ద్వారా రొనాల్డో ఏడాదికి 20 కోట్ల యూరోలు (రూ.1,755 కోట్లు) ఆర్జిస్తాడని సమాచారం. ఫలితంగా ఇది ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధిక ఒప్పందం కానుంది. 37 ఏళ్ల రొనాల్డో 2025 జూన్ వరకు అల్ నాసర్ క్లబ్ తరఫున సౌదీ ప్రొ లీగ్లో ఆడతాడు. గతంలో సౌదీ ప్రొ లీగ్ టైటిల్ను అల్ నాసర్ క్లబ్ తొమ్మిదిసార్లు సాధించింది. ‘మరో దేశంలో కొత్త ఫుట్బాల్ లీగ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. యూరోపియన్ ఫుట్బాల్లోని అన్ని ప్రముఖ టైటిల్స్ను సాధించాను. ఇక ఆసియా ఆటగాళ్లతోనూ నా అనుభవాన్ని పంచుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను’ అని రొనాల్డో వ్యాఖ్యానించాడు. మాడ్రిడ్లో జరిగిన కార్యక్రమంలో తాను ధరించనున్న ఏడో నంబర్ జెర్సీని అల్ నాసర్ క్లబ్ అధ్యక్షుడు ముసాలి అల్ ముమార్తో కలిసి రొనాల్డో ఆవిష్కరించాడు.
Shane Warne: షేన్‌వార్న్‌కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం
ప్రొఫెషనల్ ఫుట్బాల్లో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన క్లబ్ల సంఖ్య 6. గతంలో రొనాల్డో స్పోర్టింగ్ లిస్బన్ (పోర్చుగల్; 2002–2003), మాంచెస్టర్ యునైటెడ్ (ఇంగ్లండ్; 2003 నుంచి 2009 వరకు; 2021 నుంచి 2022 వరకు), రియల్ మాడ్రిడ్ (స్పెయిన్; 2009 నుంచి 2018 వరకు), యువెంటస్ (ఇటలీ; 2018 నుంచి 2021) తరఫున పోటీపడ్డాడు. తాజాగా అల్ నాసర్ క్లబ్కు ఆడనున్నాడు.
Aung San Suu Kyi: అంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలు
మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్ సాన్ సూకీ(77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో, వివిధ అభియోగాలపై ఇప్పటి వరకు ఆమెకు కోర్టులు విధించిన జైలు శిక్షల మొత్తం సమయం 33 ఏళ్లకు పెరిగింది. ఆమెపై మోపిన ఐదు అభియోగాలపై డిసెంబర్ 30న విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ హెలికాప్టర్ను మంత్రి ఒకరికి అద్దెకు ఇవ్వడంలో ఆమె నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఫిబ్రవరిలో సూకీ సారథ్యంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి, సూకీ సహా వేలాది మందిని మిలటరీ పాలకులు దిగ్బంధించిన విషయం తెలిసిందే. కోర్టులు ఆమెపై మోపిన ఆరోపణలపై రహ స్యంగా విచారణలు జరిపి, శిక్షలు ప్రకటిస్తున్నా యి. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వట్టివేనంటూ సూకీ కొట్టిపారేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని వెంటనే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైనిక పాలకులను కోరింది.
Ministry of Road Transport: 4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
Heeraben: మోదీకి మాతృవియోగం.. భావోద్వేగానికి గురైన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. వందేళ్లు సంపూర్ణ జీవితం గడిపిన ఆమె అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హీరాబెన్కు ప్రధాని మోదీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె వాసంతిబెన్ ఉన్నారు. గాంధీనగర్ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. హీరాబెన్ మరణవార్త విన్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోదీకి సంతాపం తెలిపారు.
Football legend Pele: దివికేగిన సాకర్ శిఖరం
అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో తన శకం లిఖించిన బ్రెజిల్ దిగ్గజం పీలే ఇక లేడు. మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ను గెలిపించిన బ్రెజిలియన్ సాకర్ కింగ్ పీలే డిసెంబర్ 29 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్స్టీన్ హాస్పిటల్లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు. గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్స్టీన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు.
Road Accidents: హెల్మెట్ పెట్టుకోకపోవడంతో 46,593 మంది మృతి
మూడు వరల్డ్ కప్ విజయాల్లో..
బ్రెజిల్ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్ కోసం స్వీడన్కు రిజర్వ్ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు. 17 ఏళ్ల టీనేజ్లో ప్రపంచకప్ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్ చాంపియన్షిప్లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్ (1962) నాటికి స్టార్ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్ డమ్’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు. 1966 ప్రపంచకప్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బ్రెజిల్ గ్రూప్ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్ అని పీలే ప్రకటించాడు. తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్ ఆడి బ్రెజిల్ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్ మ్యాచ్ల్లో 12 గోల్స్ చేశాడు. మూడు ప్రపంచకప్ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్బాలర్గా నిలిచాడు.
వ్యక్తిగతం
జన్మదినం: అక్టోబర్ 23, 1940
ఎక్కడ: ట్రెస్ కొరకోస్, బ్రెజిల్.
అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.
తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో.
పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి)
సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె.