Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 23rd, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 23rd 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Chris Hipkins: న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
క్రిస్ హిప్కిన్స్(44) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి కానున్నారు. ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేయడంతో ఆ పదవికి అధికార లేబర్ పార్టీ నుంచి ఎంపీ హిప్కిన్స్ ఒక్కరే నామినేషన్ వేశారు. జనవరి 22న ప్రతినిధుల సభ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2008లో తొలిసారి పార్లమెంట్కు ఎన్నికైన ఆయన 2020లో కోవిడ్–19 మంత్రిగా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్లో ఎన్నికలున్నాయి. లేబర్ పార్టీకి గెలుపు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

Jacinda Ardern: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా రాజీనామా


Buzz Aldrin: చంద్రునిపై కాలుపెట్టిన ఆ్రల్డిన్కు.. 93వ ఏట నాలుగో పెళ్లి 
చంద్రునిపై కాలు పెట్టిన రెండో వ్యక్తిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ లేటు వయసులో జనవరి 20వ తేదీ 93వ పుట్టినరోజు నాడే తన చిరకాల ప్రేయసి అయిన 63 ఏళ్ల డాక్టర్ అంకా ఫార్ను పెళ్లాడారు. లాస్ ఏంజెలెస్లో నిరాడంబరంగా తామిద్దరం వైవాహిక బంధంతో ఒక్కటయ్యామంటూ ట్వీట్ చేశారు. రెండు పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఆయన చూడచక్కని సూట్ ధరించి మురిసిపోతూ కన్పిస్తున్నారు. దానిపై మెడల్, ఎయిర్ఫోర్స్ బ్యాడ్జ్ కూడా ధరించారు. గతంలో మూడుసార్లు విడాకులు తీసుకున్న ఆ్రల్డిన్కు ఇది నాలుగో పెళ్లి! ఆయనకు ముగ్గురు పిల్లలు, ఒక మనవడు, ముగ్గురు ముని మనవలతో పాటు ఒక ముని ముని మనవరాలు కూడా ఉన్నారు. నాసా అపోల్–11 మిషన్లో భాగస్వాములైన ముగ్గురు వ్యోమగాముల్లో 1969 జూలై 20న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలుపెట్టి చరిత్ర సృష్టించడం తెలిసిందే. కాసేపటికి ఆ్రల్డిన్, ఆయన తర్వాత మైఖేల్ కొలిన్స్ చంద్రునిపై దిగారు. వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నది కూడా ఆ్రల్డినే. ఆయన 1971లో నాసా నుంచి రిటైరయ్యారు. తర్వాత షేర్స్పేస్ వెంచర్స్ స్థాపించారు. అంకా అందులో 2019 నుంచి పని చేస్తున్నారు.

Junior NTR : ఆస్కార్‌ రేసులో ఎన్టీఆర్‌.. జాబితాను వెల్లడించిన..

CJI Chandrachud: భారతీయ భాషల్లోకి తీర్పుల కాపీలు.. సీజేఐ
కోర్టు తీర్పులను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృత్రిమ మేథ(ఏఐ)ను వినియోగించుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాచార అంతరాలను తొలగించడంలో సాంకేతికత చాలా కీలకమైందని ఆయన అన్నారు. ఇంగ్లిష్లో ఉండే కొన్ని చక్కని అంశాలు గ్రామీణ ప్రాంతాల లాయర్లు ఆకళింపు చేసుకోలేరు. లాయర్లందరికీ ఉచితంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశం. ఇందుకోసం తీర్పుల ప్రతులను ఏఐను వినియోగించుకుని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయిస్తాం’అని చెప్పారు. జనవరి 21న బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. విచారణల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లా విద్యార్థులు, టీచర్లు కోర్టుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. తద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించగలుగుతారని చెప్పారు.

Caste Census: కులగణనను ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వలేం..సుప్రీంకోర్టు
 
Sikkim Govt: జనాభాను పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగినులకు వరాలు
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Exam Warriors: 13 భాషల్లో ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకం 
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకాన్ని తెలుగు లోనూ అందుబాటులోకి తెచ్చారు. నవీకరించిన ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకాన్ని తెలుగుతో కలిసి మొత్తం 13 భారతీయ భాషల్లో ముద్రించారు. దేశవ్యాప్తంగా పరీక్షల ముందు  విద్యా ర్థుల్లో భయాన్ని, ఆందోళనను పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జ‌న‌వ‌రి 27న జరగనుంది. కార్యక్రమానికి ముందు ఎగ్జామ్‌ వారి యర్స్‌ పుస్తకాన్ని హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ‘వందే భారత్‌’ రైలు
 
Mohammed Azmat Ali Khan: 9వ నిజాంగా మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌
నిజాం 9వ వారసుడి పట్టాభిషేకం జ‌న‌వ‌రి 20వ తేదీ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగింది. ఇటీవల 8వ నిజాం ముకరంజా బహదూర్‌ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జాను 9వ నిజాంగా ప్రకటించారు. నిజాం సంస్థానానికి సంబంధించిన వ్యవహారాలను కట్టబెడుతూ నిజాం కుటుంబ సభ్యులు, ట్రస్టీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా చౌమహల్లా ప్యాలెస్‌లో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇక నుంచి అజ్మత్‌ అలీఖాన్‌ నిజాం ఆస్తులు, ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. 

Mukarram Jah Bahadur: 8వ నిజాం ముకరంజా బహదూర్‌ కన్నుమూత

Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. దేశంలో తొలిసారిగా కల్నల్‌ స్థాయికి ఎదిగిన మహిళా అధికారులు
ఆకాశంలో సగం కాదు.. నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్‌ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది.   100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్‌ స్థాయికి ఎదిగారు.  
భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్‌ సహా వివిధ కమాండ్‌ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు.
1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్, ఇంటెలిజెన్స్‌ కోర్, ఆర్మీ సర్వీస్‌ కోర్, ఆర్మీ ఆర్డన్స్‌  కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఇంజనీర్స్‌ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
 

Published date : 23 Jan 2023 07:38PM

Photo Stories