Daily Current Affairs in Telugu: జనవరి 21st, 2023 కరెంట్ అఫైర్స్
Caste Census: కులగణనను ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వలేం.. సుప్రీంకోర్టు
రాష్ట్రంలో కులగణన చేపట్టాలంటూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్వేను ఆపాలంటూ వేసిన పిటిషన్‌లు విచార్హమైనవి కాదంటూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ సేథ్‌ల ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ దారులు సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘ఇవి ప్రచారం కోసం వేసిన పిటిషన్లు. ఫలానా కులానికి రిజర్వేషన్ ఇంతే ఇవ్వాలని మేమెలా చెప్పగలం? ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేం. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టలేం’ అని పేర్కొంది. పిటిషన్లను ఉపసంహరించుకుని, ఈ అంశంపై తగు నిర్ణయం కోసం పట్నా హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషన్ దారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
Assembly Elections 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
SSC Exam In Telugu: తెలుగులోనూ నాన్ టెక్నికల్ ఎస్‌ఎస్‌సీ పరీక్ష
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)–2022ను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భాష అవరోధం కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలను చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని జితేంద్ర సింగ్ తెలిపారు.
Karnataka Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు
Supreme Court: చార్జిషీట్‌ను బహిర్గతం చేయలేం.. సుప్రీంకోర్టు
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు సమర్పించే చార్జిషీట్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అలా చేయడం నిందితులు, బాధితుల హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొంది. చార్జిషీట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ దాఖలైన పిల్‌ను జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్‌ల ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ ముగించిన ధర్మాసనం తీర్పును జనవరి 20వ తేదీన వెలువరించింది. ఎఫ్‌ఐఆర్‌లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లే చార్జిషీట్లను సంబంధిత పత్రాలతో రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్‌లలో ఉంచలేమని పేర్కొంది. చార్జిషీట్‌ను బహిరంగ పరిస్తే కేసుతో సంబంధం లేని ఎన్‌జీవోలు, ఇతరులు అందులోని అంశాలను దుర్వినియోగపరిచే ప్రమాదముందని పేర్కొంది. అంతిమంగా నిందితులు, బాధితుల హక్కులకు భంగం కలుగుతుందని వివరించింది.
SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివరాలు ఇవే..
Public Urination: బహిరంగ మూత్ర విసర్జనకు చెక్ పెట్టిన లండన్!
బహిరంగ మూత్ర విసర్జనకు లండన్ యంత్రాంగం చెక్ పెట్టింది. గోడలపై పోసే మూత్రం తిరిగి వారిపైనే పడేలా పారదర్శక వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే పోసిన వ్యక్తి పైకే మూత్రం చింది పడుతుంది. దుస్తులు తడిచిపోతాయి. వారికి ఇదే తగిన శిక్ష అవుతుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఇందుకోసం సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది. సోహోలో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతోపాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. సుమారు 0.6 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలోని సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. పబ్లిక్ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు (దిస్ వాల్ ఈజ్ నాట్ ఫర్ యూరినల్) అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే ప్రయోగాన్ని మరో ప్రాంతంతోపాటు జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి, మంచి ఫలితం సాధించారు.
Rishi Sunak: రిషి సునాక్‌ను వెంటాడుతున్న వివాదాలు.. సీట్‌బెల్ట్ పెట్టుకోకుంటే ఇంత రాద్ధాంతమా...!
Nikah Halala: బహు భార్యత్వం, నిఖా హలాలాపై సుప్రీం బెంచ్
ముస్లింలు పాటిస్తున్న బహు భార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగ చట్టబద్ధతను తేల్చేందుకు త్వరలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బహు భార్యత్వం, నిఖా హలాలాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలంటూ న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిల్‌నుద్దేశిస్తూ కోర్టు ఈ విషయాన్ని తెలిపింది. ‘బహు భార్యత్వం సహా పలు కీలకాంశాలు గతంలోనే ఏర్పాటైన సంబంధిత ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉన్నాయి. అయితే ఈ బెంచ్‌లోని ఇద్దరు జడ్జీలు రిటైర్ అవడంతో కొత్త వారితో బెంచ్‌ను ఏర్పాటుచేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పని పూర్తిచేస్తాం’ అని సీజేఐ అన్నారు. బహు భార్యత్వం ప్రకారం భారత్‌లోని ఒక ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. కాగా, మాజీ భర్తను పెళ్లాడాలంటే ఒక ముస్లిం మహిళ.. మరొకరిని పెళ్లాడి, విడాకులు ఇవ్వాలి. ఆ తర్వాతే మాజీ భర్తను పెళ్లిచేసుకోవచ్చు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Remote voting: ఓటు వలస వెళుతుందా.. రిమోట్ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి!
ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం ఓటు. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్‌వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్‌వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్‌సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్‌వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది.
Shehbaz Sharif: యుద్ధాలతో గుణపాఠాలు నేర్చుకున్నాం.. పాక్ ప్రధాని షహబాజ్
ఎందుకీ ఆర్‌వీఎంలు ?
వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
WTT Contender: మనిక ఖాతాలో రెండు కాంస్యాలు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు కాంస్య పతకాలు సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్‌తో కలిసి కాంస్యం నెగ్గిన ఈ ఢిల్లీ అమ్మాయి మహిళల సింగిల్స్‌లోనూ కాంస్య పతకం కైవసం చేసుకుంది. దోహాలో జనవరి 20న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–మనిక ద్వయం 6–11, 11–9, 7–11, 8–11తో షిన్ యుబిన్–లిమ్ జాంగ్‌హూన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మనిక 6–11, 11–2, 4–11, 2–11తో జాంగ్ రుయ్ (చైనా) చేతిలో ఓడింది.
Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై
Amazon Web Services: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.36వేల కోట్లు
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తమ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ద్వారా హైదరాబాద్‌లో మరోసారి భారీ పెట్టుబడులు పెట్టనుంది. నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 20,096 కోట్ల పెట్టుబడి పెడతామని 2020లో ప్రకటించిన ఏడబ్ల్యూఎస్ తాజాగా తమ విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా 2030 నాటికి దశలవారీగా తమ పెట్టుబడులను రూ.36,300 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే కొత్తగా మరో రూ.16,204 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.
Bharti Airtel: హైదరాబాద్‌లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎయిర్‌టెల్ రూ.2,000 కోట్ల పెట్టుబడి
జనవరి 20వ తేదీ నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్’లో ఆ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించేందుకు ఏడబ్ల్యూఎస్ ఇప్పటికే చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ల క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. వాటి మొదటి దశ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Chaganti Koteswara Rao: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్(HDPP) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జనవరి 20వ తేదీ హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.