Skip to main content

జనరల్‌ ఝావోకి కీలక బాధ్యతలు

భారత సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) మాజీ ఉన్నతాధికారి జనరల్‌ ఝావో జాంగ్‌ఖిని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ)లోని విదేశీ వ్యవహారాల కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా చైనా నియమించింది.
Current Affairs
2017 నాటి డోక్లాం వివాదం సమయంలో, 2020 నాటి లద్దాఖ్‌ ఉద్రిక్తతల సమయంలో జనరల్‌ ఝావో చైనా వెస్ట్రన్‌ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఎన్‌పీసీలోని ముఖ్యమైన బృందాల్లో విదేశీ వ్యవహారాల కమిటీ కూడా ఒకటి.

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు
అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ (66)కి పారిస్‌లోని ఓ న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షాకాలాన్ని సర్కోజీ తన నివాసం నుంచే పూర్తి చేసే అవకాశం ఉంది. జాక్‌ షిరాక్‌ తర్వాత జైలు శిక్ష పడిన రెండో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీయే. 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా పనిచేసిన సర్కోజీ 2014లో ఓ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించేందుకు సీనియర్‌ మేజిస్ట్రేట్‌కు లంచం ఆశచూపారని కోర్టులో రుజువైంది.

ఫ్రాన్స్‌ రాజధాని: పారిస్‌; కరెన్సీ: యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్‌ కాస్టెక్స్‌
ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం పేరు: ఎలీసీ ప్యాలెస్‌

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : ఎన్‌పీసీలోని విదేశీ వ్యవహారాల కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : జనరల్‌ ఝావో జాంగ్‌ఖి
ఎక్కడ : చైనా
Published date : 02 Mar 2021 06:12PM

Photo Stories