Skip to main content

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం నంబూద్రి కన్నుమూత

55వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, సంఘసంస్కర్త, పాత్రికేయుడు అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి (94) కన్నుమూశారు.
Edu newsకొద్దిరోజులుగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిస్సూర్‌లో అక్టోబర్ 15న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మలయాళం కవిత్వానికి ఆధునికతను అద్దిన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. 1956లో కోజికోడ్‌లో ఆల్ ఇండియా రేడియోలో చేరే ముందు అనేక పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు.

ఆధునిక కవిత్వాల్లో ఒకటిగా...
అక్కితమ్ కలం నుంచి జాలువారిన ‘ఇరుపతం నూట్టండింటే ఇతిహాసం(20వ శతాబ్దపు ఇతిహాసం)’ను మలయాళ సాహిత్యంలో తొలి ఆధునిక కవిత్వాల్లో ఒకటిగా పరిగణిస్తారు. కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ అక్కితమ్ తనదైన ముద్ర వేశారు. దాదాపు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అందుకున్న ఆయన 2019లో 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

చదవండి: జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఎవరు ప్రదానం చేస్తారు? మొదటి జ్ఞాన్‌పీఠ్‌ను ఎప్పుడు ప్రదానం చేశారు? ఎంతమంది తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు? రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్ని భాషలకు సంబంధించి ఈ అవార్డును ఇస్తారు?

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, సంఘసంస్కర్త, పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి (94)
ఎక్కడ : త్రిస్సూర్, కేరళ
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో
Published date : 16 Oct 2020 06:15PM

Photo Stories