జమ్మూకశ్మీర్‌లో ఈయూ బృందం పర్యటన
Sakshi Education
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి 23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించింది.
అక్టోబర్ 29న కశ్మీర్‌లో పర్యటించిన ఈయూ బృందం స్థానిక ప్రజలతో, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. ఆర్టికల్ 370రద్దు విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీల బృందం సమర్ధించింది. కశ్మీర్ లోయలోని ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : 23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం
ఎందుకు : కశ్మీర్‌లోని పరిస్థితులను తెలుసుకునేందుకు
Published date : 30 Oct 2019 05:38PM