జమ్మూకశ్మీర్ తొలి మహిళా బస్సు డ్రైవర్?
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా పూజాదేవి రికార్డులకెక్కింది.
కశ్మీర్‌లోని కథువా ప్రాంతానికి చెందిన పూజాదేవి డిసెంబర్ 24న తొలిసారి కథువా-జమ్మూ మధ్య ప్యాసింజర్ బస్సు నడిపారు. పూజాదేవిది పేద కుటుంబం. పెద్దగా చదువుకోలేదు. తండ్రి సన్నకారు రైతు. చిన్నతనం నుంచే డ్రైవింగ్‌పై మక్కువ కలిగిన పూజా కారు డ్రైవర్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశారు. ట్రక్కు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు.
64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్...
ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్... 64 ఏళ్ల వయసులో నీట్ ర్యాంక్ సాధించారు. కిశోర్ విద్యార్థి దశలోనే ఎంబీబీఎస్ చదవాలనుకున్నప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా వీలుపడలేదు. తర్వాత బ్యాంక్ ఉద్యోగంలో చేరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. తగినంత ఖాళీ దొరకడంతో ప్రిపేర్ అయి నీట్ ర్యాంక్ సాధించారు. ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : పూజాదేవి
ఎక్కడ : జమ్మూకశ్మీర్

Published date : 29 Dec 2020 06:27PM