Skip to main content

జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లుకు ఆమోదం

జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు-2021ను ఫిబ్రవరి 8న రాజ్యసభ ఆమోదించింది.
Edu news

జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్‌‌స స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.

టైమ్స్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ ఐఎస్‌బీ...
ది ఫైనాన్షియల్ టైమ్స్-గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకై క సంస్థగా నిలిచింది. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. 2020 ఏడాది ర్యాంకుల్లో 28వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
 
ఏమిటి : జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు-2021కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేసేందుకు

Published date : 09 Feb 2021 06:14PM

Photo Stories