Skip to main content

జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు ఆమోదం

జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2019’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 9న ఆమోదం తెలిపారు.
దీంతో ఇప్పటికే పార్లమెంటులో పాసయిన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి అమలవుతుందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చే సింది. దీంతో 2019, అక్టోబర్ 31 నుంచి జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా అవతరించనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 10 Aug 2019 06:45PM

Photo Stories