జమ్మూకశ్మీర్ లాంగ్వేజెస్ బిల్లు ఉద్దేశం ఏమిటీ?
Sakshi Education
జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి.
స్కూల్‌నెట్ విక్రయానికి అనుమతి...
రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. స్కూల్‌నెట్ ఇండియా (గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కున్న 73.69 శాతం వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్‌స (ఎల్‌ఈహెచ్‌ఎల్)కు ఇప్పటికే స్కూల్‌నెట్‌లో 26.13 శాతం వాటా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు

Published date : 03 Sep 2020 04:59PM