జలియన్ వాలాబాగ్ బిల్లుకు ఆమోదం
Sakshi Education
జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం-1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ ఆగస్టు 2న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. ప్రస్తుతం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ గవర్నర్ సభ్యలుగా ఉన్నారు.
మరోవైపు దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ ఆగస్టు 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం-1951 (సవరణ)బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : లోక్‌సభ

Published date : 03 Aug 2019 05:40PM