జల జీవన్ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్న మంత్రి... ఇందుకోసం బడ్జెట్‌లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో... అన్ని ఇళ్లకూ మంచి నీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా... అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ప్రారంభిస్తామన్న నిర్మల సీతారామన్ ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1.42 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి తన రెండో బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి NDA ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను కొనసాగిస్తూ... కొత్త పథకాలకు శ్రీకారం చుటుడుతున్నట్లు కనిపిస్తోంది.
ఆరు మూల స్తంభాలపై కొత్త బడ్జెట్..
"2021-2022 బడ్జెట్ ఆరు స్తంభాలపై ఆధారపడింది. మొదటి స్తంభం ఆరోగ్యం, సంక్షేమం. రెండోది భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు. మూడోది ఆకాంక్షల భారతదేశ సమగ్రాభివృద్ధి, నాలుగోది మానవ మూలధన పునరుజ్జీవం, ఐదోది ఆవిష్కరణ, పరిశోధన. ఆరోది కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన" అని నిర్మలా సీతారామన్ అన్నారు.