జకోవిచ్‌కు దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్
Sakshi Education
ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కెరీర్‌లో 79వ టైటిల్ సాధించాడు.
భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 29న ముగిసిన దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ తుదిపోరులో జకోవిచ్ 6-3, 6-4తో స్టెఫానో సిట్సిపాస్(గ్రీస్)పై గెలుపొందాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి.. నాదల్ నుంచి తిరిగి నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్న జకోవిచ్ తాజా టైటిల్ ద్వారా తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో జకోవిచ్‌కు ఇది వరుసగా 18వ విజయం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 29
ఎవరు : నొవాక్ జకోవిచ్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 29
ఎవరు : నొవాక్ జకోవిచ్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 02 Mar 2020 05:42PM