Skip to main content

జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఇండియా తొలి సీఈవోగా నియమితులైనవారు?

సేంద్రియ ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఇండియా తొలి సీఈవోగా అమిత్‌ త్రిపాఠి నియమితులయ్యారు.
Current Affairs

బయో అగ్రికల్చర్‌ విభాగంలో విస్తరించాలన్న సంస్థ లక్ష్యంలో భాగంగా ఈ నియామకం చేపట్టినట్టు అక్టోబర్ 27న కంపెనీ తెలిపింది. 70కిపైగా దేశాలకు కంపెనీ తన ఉత్పత్తులు, సేవలతో విస్తరించింది. ఇండోఫిల్, బయోస్టాట్, డ్యూపాంట్, జైటెక్స్‌ వంటి సంస్థల్లో అమిత్‌ త్రిపాఠి గతంలో పనిచేశారు. ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.


ఫేస్‌బుక్‌ను వీడిన అంఖి దాస్‌

ఫేస్‌బుక్‌ ఇండియా పాలసీ హెడ్‌ అంఖి దాస్‌ ఫేస్‌బుక్‌ను వీడారు. సమాజ సేవ చేయడం కోసమే ఫేస్‌బుక్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామా అనంతరం ఫేస్‌బుక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్ అక్టోబర్ 27న ఈ విషయాలను వెల్లడించారు. బీజేపీకి, హిందుత్వకు మద్దతుగా విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌లోఅనుమతిచ్చారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

యూఎస్‌ సుప్రీం జడ్జిగా బారెట్‌ ప్రమాణం

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ అక్టోబర్ 27న ప్రమాణ స్వీకారం చేశా రు. ఆమె నియామకానికి సెనేట్‌ ఆమోదం తెలిపిన గంటలోనే ప్రమాణ స్వీకారం జరిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు సుప్రీం జడ్జి క్లారెన్స్ థామస్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 9మంది న్యాయమూర్తుల్లో బారెట్‌తోసహా ట్రంప్‌ ముగ్గురిని నియమించారు. అమెరికా ప్రీంకోర్టులోజడ్జిలకు రిటైర్‌మెంట్‌ ఉండదు. జీవితకాలం వారు న్యాయమూర్తులుగా ఉంటారు. తాజా నియామకంతో కన్జర్వేటివ్స్‌కు సుప్రీంలో 6–3 నిష్పత్తిలో మద్దతు లభించనుంది.

క్విక్ రివ్వూ :

ఏమిటి : జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఇండియా తొలి సీఈవోగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అమిత్‌ త్రిపాఠి
Published date : 28 Oct 2020 05:28PM

Photo Stories