జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా శ్రీధర్
Sakshi Education
భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జీఎస్‌ఐ) డెరైక్టర్ జనరల్‌గా ఎం.శ్రీధర్ ఫిబ్రవరి 3న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ బాధ్యతలను చేపట్టడానికి ముందు జీఎస్‌ఐ దక్షిణ ప్రాంతం అదనపు డెరైక్టర్ జనరల్‌గా శ్రీధర్ సేవలందించారు. 1986లో జీఎస్‌ఐలో చేరిన ఆయన హిమాలయాలు మొదలుకొని దక్షిణ భారత ద్వీపకల్పం వరకు భూవైజ్ఞానిక రంగంలో విసృ్తతంగా కార్యకలాపాలు నిర్వహించారు. జీఎస్‌ఐకి చెందిన వివిధ జాతీయ ప్రాజెక్టులను నిర్వహించడంలో టెక్నోఅడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు. వజ్రాల అన్వేషణ రంగంలో ఆయన అసాధారణ తోడ్పాటు అందించినందుకు కేంద్రం నేషనల్ జియో సైన్స్ అవార్డును శ్రీధర్‌కు ప్రదానం చేసింది.
జీఎస్‌ఐ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ మాట్లాడుతూ... ఖనిజాల అన్వేషణలో మెరుగైన ఫలితాల సాధన, క్షేత్రస్థాయి కార్యకలాపాల పెంపు, ప్రయోగశాలలకు పునరుత్తేజాన్ని ఇవ్వడం వంటి వాటితోపాటు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌డీ) కార్యకలాపాలకు ప్రాధాన్యాన్ని ఇస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎస్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ఎం.శ్రీధర్

Published date : 05 Feb 2020 05:46PM